తిరుమలలో శ్రీవారి సేవలో దీపికా పదుకొణే, దగ్గుపాటి - తిరుమలలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 1:23 PM IST
Movie celebrities In tirumala temple : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే, తెలుగు సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ దంపతులు, వారి చిన్న కుమారుడు అభిరామ్ దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులకు తిరుమల తిరుపతి దేవస్థానం ( tirumala tirupati temple) అధికారులు సాదర స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Heroine Deepika Padukone, Producer Daggupati Suresh Babu in Tirumala : దీపిక పదుకొణే, సురేష్ బాబు కుటుంబీకులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. దీపికా పదుకొణే, దగ్గుబాటి సురేష్ కుటుంబ సభ్యులకు పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో సినీ ప్రముఖుల రాకతో కొంత సేపు సందడి వాతావరణం నెలకొంది. వారిని చూడడానికి అభిమానులు ఉత్సాహం చూపించారు.
TAGGED:
tirumala latest news