Train Accident:నెల్లూరులో రైలు ఢీకొని.. రొట్టెల పండుగకు వచ్చిన తల్లి, కుమార్తె మృతి - నెల్లూరు రైల్వే బ్రిడ్జి వద్ద రైలు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
Train Accident at Nellore Railway Bridge: పండగ చూద్దామని, సంతోషంగా గడుపుదామని వచ్చిన ఆ తల్లీ, కుమార్తెలను ట్రైన్ రూపంలో మృత్యువు కబలించింది. నెల్లూరులోని రొట్టెల పండగ కోసం వచ్చిన తల్లీ, కుమార్తెలు రైలు ప్రమాదంలో మృతి చెందారు. నెల్లూరులోని ఆత్మకూరు రైల్వే వంతెన వద్ద.. ట్రాక్ దాటుతుండగా రైలు ఢీ కొని ఇద్దరు మృతి చెందారు. చనిపోయన వారిని గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తల్లీ కుమార్తె.. ఫాతిమా, గౌస్యగా పోలీసులు గుర్తించారు. రొట్టెల పండుగ సందర్భంగా బారాషాహీద్ దర్గాకు వచ్చినట్లు తెలిపారు. ట్రాక్ దాటుతుండగా ముదురై - నిజాముద్దీన్ రైలు ఢీ కొట్టిందని స్పష్టం చేశారు. దీంతో వంతెన వద్ద కొద్దిసేపు ట్రైన్‌ని నిలిపివేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. రొట్టెల పండగ కోసం అని వచ్చిన వారు.. రైలు ప్రమాదంలో తల్లీ కుమార్తె ఇద్దరూ మృతి చెందడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.