Rachamallu Siva Prasad Reddy: 'నా అప్పులు తీరడానికి జగన్ ప్రభుత్వం కారణం కాదు' - YSRCP MLA SENSATIONAL COMMENTS

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 6, 2023, 10:56 PM IST

MLA Rachamallu Siva Prasad Reddy Comments: తాను ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించలేదని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 2019 కి ముందు తనకు అప్పులు ఉండేవన్నారు. 2019 తర్వాత ఆ అప్పులు తీరిపోవడానికి కారణం జగన్ ప్రభుత్వం కాదన్న ఎమ్మెల్యే రాచమల్లు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించానన్నారు. ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బుతోనే అప్పులన్నీ తీర్చానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 

తనపై గుట్కా, క్రికెట్ బెట్టింగులు, ఇసుక దందా, ఎర్రచందనం, మద్యపానం, రౌడీయిజం ఇలా వివిధ రకాల ఆరోపణలు చేశారని అన్నారు. ఒక ఎమ్మెల్యే ఎలా క్రికెట్ బెట్టింగ్​లు నిర్వహిస్తాడని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పిన అంశాలపై స్పందించి.. తనపై సీబీఐ విచారణ కూడా తాను కోరినట్లు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. తాను రియల్ ఎస్టేట్ వలనే డబ్బులు సంపాదించానని పేర్కొన్నారు. రాజకీయాలలో ఎటువంటి డబ్బు సంపాదించలేదని అన్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.