Gadapa Gadapaku Program: 'గడప గడపకు మన ప్రభుత్వం'లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం.. - ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం
🎬 Watch Now: Feature Video

MLA Mekapati Vikram Reddy Gadapa Program: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిని ఏఎస్ పేట మండలం చౌట భీమవరం ప్రజలు నిలదీశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటికి సమస్యల చిట్టాను గ్రామస్థులు అందజేశారు. గతంలో మేకపాటి రామ్మోహన్‌రెడ్డికి, మేకపాటి గౌతమ్‌రెడ్డికి.. మీకూ.. ఇతర అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. సమస్యలు పరిష్కారం కావటంలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలోకి ఆర్టీసీ బస్సు కూడా రావడం లేదంటూ తెలిపారు. తాము గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం వైఎస్సార్సీపీకి అభిమానులుగా ఉన్నామని అన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో తమ పని కాకపోవడం బాధ కలిగిస్తుందంటూ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిని నిలదీశారు. ఎన్నికల సమయంలో తమ గ్రామానికి వచ్చి హామీలు ఇస్తారని, .. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని గాలికొదిలేస్తారంటూ వాపోయారు. స్థానికుల అర్జీలు పరిశీలించిన ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామంటూ తెలుపుతూ అక్కడ నుండి వెళ్లిపోయారు.