MLA Kotamreddy Performed Yagam for CBN భగవంతుడు చంద్రబాబుకు ఆ శక్తినివ్వాలి.. నెల్లూరులో కోటంరెడ్డి బ్రదర్స్ యాగం - కోటంరెడ్డి కార్యాలయంలో ప్రత్యేక పూజలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 6:28 PM IST
MLA Kotamreddy Performed Yagam for CBN: మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు అక్రమ కేసుల నుంచి విడుదల అవ్వాలని.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బంధ విమోచన యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి జరిపించారు. చంద్రబాబుకు ఎదురవుతున్న ప్రతి బంధకాలు తొలగాలని.. ఆయనపై జరుగుతున్న రాజకీయ కుట్రలను తిప్పికొట్టే విధంగా ఆ భగవంతుడు ఆ కుటుంబానికి శక్తిని ఇవ్వాలని ప్రార్ధనలు చేసినట్లు కోటంరెడ్డి తెలిపారు. చంద్రబాబు కోసం కోట్లాదిమంది ప్రజల చేస్తున్న పోరాటాలు, పూజలు ఫలించాలని.. మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ తడకపల్లి సుధా రవీంద్ర, టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
TAGGED:
andhra pradesh latest news