ఇది సరైన సమయం కాదు - అంగన్వాడీల డిమాండ్లపై మంత్రి ఉషశ్రీ చరణ్‌

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 4:51 PM IST

Minister Ushasri Charan on Anganwadi Workers Strike: అంగన్వాడీల డిమాండ్​లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉషశ్రీ చరణ్ వెల్లడించారు. అంగన్వాడీలు సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచామని తెలిపారు. ఉద్యోగ విరమణ వయస్సును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశామన్నారు. గతంలో తెలంగాణకు సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరిన వెంటనే 11 వేల 500 రూపాయలకు వేతనాలు పెంచామని గుర్తుచేశారు. 

పదోన్నతి వయస్సును 45-50కి పెంచామని చెప్పారు. అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అర్హతను బట్టి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను ఎవరూ పగలగొట్టలేదని, ఆయా జిల్లా కలెక్టర్​లు కేంద్రాలను నడిపేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. 

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.