నగరి అసెంబ్లీ సీటు ఎవరికిచ్చినా నో ప్రాబ్లం - జగన్ కోసం నా ప్రాణాలైనా ఇస్తా : మంత్రి రోజా - Minister Roja Latest Commetns
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 5:23 PM IST
Minister Roja on Nagari Assembly Seat: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక అంశంలో గందరగోళం నెలకొంది. ఏ స్థానం ఎవరికి కేటాయించాలనే ఆయోమయంలో పార్టీ అధిష్ఠానం ఉంది. ఈ క్రమంలో ప్రాంతీయ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతూ, నియోజకవర్గ ఇన్ఛార్జులు, అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో మంత్రి రోజా నగరి అసెంబ్లీ సీటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ఎవరిని ఎంపిక చేసినా అభ్యంతరం లేదని మంత్రి రోజా అన్నారు. అనేక సందర్భాల్లో తాను ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు ఆమె గుర్తు చేశారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి రోజా మంగళవారం దర్శించుకున్నారు. టీటీడీ ఆలయాధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పూర్తి చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
Nagari Constituency YSRCP Candidate: నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు ఎవరికి ఇచ్చినా తనకు ఇబ్బందేమీ లేదని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను సీఎం సైనికురాలినని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనకు ముఖ్యమని, జగన్ కోసం తన ప్రాణాలైనా ఇస్తానంటూ ఆమె వ్యాఖ్యానించారు. రోజాకు ఎమ్మెల్యే స్థానం కేటాయించడం లేదని ఆనందం పొందుతున్న వారికి అది కొన్ని రోజులేనని అన్నారు. తనకే నగరి ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారనే విషయం వైసీపీ కార్యకర్తలకు, నేతలకు తెలుసని పేర్కొన్నారు.