వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడంలో ఏపీ ముందంజ : మంత్రి పెద్దిరెడ్డి
🎬 Watch Now: Feature Video
Minister Peddireddy Review on Electrical Power: వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్‌ను అందించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ముందంజలో ఉందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కృష్ణపట్నం, ఎన్టీటీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 1,600 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురాగలిగామని మంత్రి వెల్లడించారు. సచివాలయంలో ఇంధన శాఖపై మంత్రి సమీక్షించారు. పీక్ లోడ్ అవసరాల కోసం పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ల ద్వారా అదనపు విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తున్నామాన్నారు.
Electrical Energy: ఇవి వినియోగంలోకి వస్తే రాష్ట్ర అవసరాలు తీరడంతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్‌ను విక్రయించే సామర్థ్యంను సాధిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది పోలవరంలో ఒక యూనిట్ ద్వారా హైడల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి వివరించారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై కూడా రైతుల్లో సానుకూలత వ్యక్తమవుతోందని తెలిపారు. దీనిని ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని అన్నారు. డిస్కంల పరిధిలో పంపిణీ నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, దీంతోపాటు బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.