డబ్బు కట్టిన నెల రోజుల్లోనే 'రైతు నేస్తం' యాప్‌ ద్వారా విద్యుత్ కనెక్షన్‌: మంత్రి పెద్దిరెడ్డి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 7:25 PM IST

Updated : Nov 6, 2023, 7:50 PM IST

Minister Peddireddy Launched Rythu Nestham App: డబ్బులు కట్టిన నెల రోజుల్లోనే రైతులకు విద్యుత్ కనెక్షన్​ ఇచ్చేలా.. రాష్ట్ర ప్రభుత్వం 'రైతు నేస్తం' అనే యాప్‌ను అమల్లోకి తీసుకొచ్చిందని పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ తమ ప్రభుత్వ హయాంలో 3 లక్షల 78వేల 196 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడేలా ఈ యాప్‌ను రూపొందించామన్నారు. 

Peddireddy Comments: తిరుపతిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో 'రైతు నేస్తం' యాప్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..''SPDCL ద్వారా డబ్బు కట్టిన నెల రోజుల్లో రైతులకు విద్యుత్ కనెక్షన్‌లు ఇసున్నాం. మా ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకూ 3 లక్షల 78వేల 196 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. ప్రస్తుతం నాలుగు డిస్కంలలో 1,600 విద్యుత్ కనెక్షన్‌లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరితగతిన ఇచ్చేందుకు ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. వాట్సాప్ ద్వారా, చాట్‌బాట్ వెబ్‌సైట్ ద్వారా రైతులకు మరింత సులభతరంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నాం'' అని ఆయన అన్నారు.

Last Updated : Nov 6, 2023, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.