Minister Peddireddi Elections తప్పు చేసిన వాళ్లు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే..175 స్థానాలు గెలుస్తాం: మంత్రి పెద్దిరెడ్డి - ఎకో పార్కుల అభివృద్ధి న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2023, 4:53 PM IST
Minister Peddireddi Elections : రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో.. ఎకో పార్కులు అభివృద్ధి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అటవీ ప్రాంతంలో ఎకో పార్కును.. ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలు గెలుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని పెద్దిరెడ్డి అన్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో గెలిస్తే చాలని మంత్రి సవాల్ విసిరారు.
"రాష్ట్రంలోని నగరాల్లో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో.. ఎకో పార్కులు అభివృద్ధి చేస్తాము. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలు గెలుస్తాము. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో గెలిస్తే చాలు." -పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అటవీశాఖ మంత్రి
కాగా ఇటీవల అనంతపురంలో సాగునీటి, వ్యవసాయ సలహా కమిటి సమావేశం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి.. మీడియాతో మాట్లాడారు. సమావేశంలో పలు సమస్యలపై చర్చించామని, అన్నింటినీ పరిష్కరిస్తామని అన్నారు. రాప్తాడు నియోజకవర్గంపై సమీక్షించామని, తన దృష్టికి తెచ్చిన వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ క్రమంలో సాగునీటి అవసరాలతో పాటు, ఇతర అంశాలపై చర్చించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.