Minister Nagarjuna on Chandrababus Health: మందులు వేసుకుంటే సరిపోతుంది.. చంద్రబాబు అనారోగ్యంపై మంత్రి మేరుగు నాగార్జున వ్యాఖ్యలు - అంబేద్కర్ విగ్రహం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-10-2023/640-480-19757403-thumbnail-16x9-minister-nagarjuna-on-chandrababu-health.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 13, 2023, 4:12 PM IST
Minister Nagarjuna on Chandrababus Health : రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ఇదే విషయమై మంత్రి మేరుగు నాగార్జున మరోలా వ్యాఖ్యానించారు. విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్ని డిప్యూటీ సీఎంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబుకు జైల్లో వైద్యులు సూచించిన మందులు వేసుకుంటే సరిపోతుందని చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకు డీహైడ్రేషన్, అలెర్జీపై ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోందన్న ప్రశ్నలకు మంత్రి ఎగతాళిగా సమాధానం చెప్పారు. తనకూ జలుబు ఉందని ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని మంత్రి చెప్పుకొచ్చారు. విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్ని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణతో కలిసి మంత్రి పరిశీలించారు. 80 అడుగుల కట్టడంపై 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. త్వరలోనే ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు.