Minister Karumuri Fire On Farmer: ఎర్రిపప్పా ధాన్యం మొలకొస్తే నేనేం చేస్తానంటూ రైతుపై మంత్రి దుర్భాషలు - కారుమూరి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18441446-120-18441446-1683431725661.jpg)
Minister Karumuri Fire On Farmers: హలంతో పొలం దున్నే రైతన్నకు కనీసం మర్యాద ఇవ్వకుండా కోపంతో ఊగిపోయి దుర్భాషలాడాడు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఈ ఘటన జరిగింది.
అకాల వర్షా లతో ధాన్యం మొలకొచ్చిందంటూ...సమస్యను విన్నవించుకున్న రైతుపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దుర్భాషలాడారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు వేంకటేశ్వరస్వామి దేవాయంలో అన్నసమారాధాన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి ప్రజలతో మాట్లాడారు. ఆ సమయంలో ఓ రైతు.. ధాన్యం తడిసి.. మొలకొచ్చిందని చెప్పారు. ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి... 'ఎర్రిపప్పా..మొలకలొస్తే నేనేం చేస్తా' అని ఆగ్రహంతో రైతును దూషించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో.. వైరల్ అవుతోంది. మంత్రి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని మంత్రి వద్ద ప్రస్తావించగా.. తాను అన్నది బూతు కాదు కాదా అని బదులిచ్చారు. ధాన్యం మొలకొచ్చిందని సమస్య విన్నవించిన రైతుపై మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ చదవండి: