Minister Jogi Ramesh Challenge to Pawan Kalyan: 'వాలంటీర్‌ను అభ్యర్థిగా పెట్టి పవన్‌ను ఓడిస్తాం' - ముమ్మిడివరం లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Minister Jogi Ramesh Challenge to Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ టీడీపీతో పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిస్తే.. వాలంటీర్‌ను అభ్యర్థిగా పెట్టి పవన్‌ను ఓడిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు స్థానికంగా ఉండేవారిని వాలంటీర్లుగా నియమిస్తే.. వారిని అరాచక శక్తులుగా, ఆడపిల్లలను అపహరించేవారిగా అభివర్ణించడం పవన్ వైఖరికి అద్దం పడుతోందన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పవన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరంలో స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయెల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనతంరం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న జోగి రమేశ్ పై వ్యాఖ్యలు చేస్తూ.. పవన్‌కు సవాల్ విసిరారు.