Minister Gudivada Amarnath on Jamili Elections: కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్తే.. ఏపీకీ పెద్ద నష్టమేమి లేదు: మంత్రి అమర్నాథ్ - Minister Amarnath Key comments on Jamili Elections

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 4:16 PM IST

Minister Gudivada Amarnath Key comments on Jamili Elections: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జమిలి (ఓకే దేశం-ఓకే ఎన్నిక) ఎన్నికలపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల వల్ల లాభమా..?, నష్టమా..? అన్న విషయాలపై విస్తృత్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు వెళ్తే.. ఆంధ్ర రాష్ట్రానికి పెద్దగా నష్టమేమి ఉండదన్నారు. రాష్ట్రంలో జమిలి ఎన్నికలు జరగాల్సి వస్తే.. వైఎస్సార్సీపీకి అభ్యంతరమేమి లేదన్నారు. అయితే, ఈ జమిలి ఎన్నికల విషయంలో.. తుది నిర్ణయం మాత్రం తమ పార్టీ (వైఎస్సార్సీపీ) అధినేత జగన్‌ మోహన్ రెడ్డిదేనని మంత్రి వెల్లడించారు.

వైఎస్సార్సీపీ నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం.. విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని మధురవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని మంత్రి గుడివాడ అమర్ననాథ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ..26 జిల్లాల్లో నూతనంగా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయాల్లో మెుదట ప్రారంభించింది ఇదే అని తెలిపారు. ఇప్పటి నుంచి విశాఖపట్నం జిల్లాకు చెందిన పార్టీ కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయని వెల్లడించారు. 26 జిల్లాల్లో 26 పార్టీ కార్యాలయాలను నిర్మించాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు..శనివారం నాడు మొదటి కార్యాలయాన్ని విశాఖలో ప్రారంభించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.