Minister on Panchakarla ఒకటి రెండు చేపలు చచ్చి బయటపడితే.. పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు : మంత్రి అమర్నాథ్​ - Gudivada Amarnath

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 15, 2023, 7:27 AM IST

Updated : Jul 15, 2023, 7:44 AM IST

Minister Gudivada Amarnath: విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్​బాబు పార్టీ నుంచి వైదలగటంపై రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్​ స్పందించారు. పార్టీ అధికారంలో ఉందని చాలామంది వస్తుంటారు.. పోతుంటారని ఆయన అన్నారు. అధికారం అనుభవించి వెళ్లిపోతున్న నాయకులతో వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి పేర్కొన్నారు. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ సముద్రం లాంటిదని.. ఆ సముద్రంలో నుంచి ఒకటి రెండు చేపలు చచ్చి బయటపడితే పార్టీకి వచ్చే నష్టమేమి ఉండదని అన్నారు. విశాఖపట్నం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పంచకర్ల రాజీనామాతో పార్టీకి వచ్చిన నష్టమేమీ ఉండదని చెప్పారు. వాలంటీర్​ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్న జనసేన పార్టీకి మంత్రి సవాల్​ విసిరారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్ధలపై విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీలు.. ఆ రెండు వ్యవస్థలను రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే ధైర్యం ఉందా అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. కరోనా సమయంలో వాలంటీర్లు ఎంతో సేవ చేశారని మంత్రి అమర్నాథ్ అన్నారు. 

Last Updated : Jul 15, 2023, 7:44 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.