e Chits in AP: చిట్‌ఫండ్‌ సంస్థల నియంత్రణకు 'ఇ-చిట్స్​'.. ప్రారంభించిన మంత్రి ధర్మాన - ఇ చిట్స్​ విధానం ప్రారంభం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 15, 2023, 8:40 PM IST

Minister Dharmana Inaugurated e Chits System: ఏపీలో చిట్ ఫండ్ కంపెనీల నియంత్రణ కోసం కొత్తగా ఇ చిట్స్ అనే ఎలక్ట్రానిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన ఇ-చిట్స్ విధానాన్ని ఆయన ప్రారంభించారు. చందాదారులు అంతా ఇ- చిట్స్ ద్వారా తమ డబ్బు సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. చిట్స్ వేసే చందాదారులు మోసపోకుండా చూడాలనే ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఆన్​లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించాలని మంత్రి స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్​లైన్​లో వాటిని పరిశీలించి ఆమోదం తెలియజేస్తారని మంత్రి అన్నారు. ఈ విధానం ద్వారా మాత్రమే ఇక నుంచి చిట్​లు నిర్వహించాలని మంత్రి తెలిపారు. గతంలో నమోదు అయిన సంస్థలు క్రమంగా ఈ విధానంలోకి రావాల్సిందేనని అన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.