ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపు ఆలస్యంపై స్పందించిన మంత్రి
🎬 Watch Now: Feature Video
Minister Buggana Rajendranath Reddy comments: ఆరోగ్య శ్రీ బిల్లులు 3 నెలలు ఆలస్యం అయిన మాట వాస్తవమేనని, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, ఈ అంశాన్ని కొన్ని మీడియాలు రాద్ధాంతం చేస్తున్నాయని బుగ్గన అసహనం వ్యక్తం చేశారు. కర్నూలు సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగంలో... క్యాత్ లాబ్ ను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వంలో కేవలం వెయ్యి జబ్బులే ఆరోగ్యశ్రీలో ఉంటే... తమ ప్రభుత్వం 3 వేల జబ్బులకు ఆరోగ్యశ్రీ వర్తించజేసిందని మంత్రి తెలిపారు. ఈ ఐదేళ్లలో పేదల ఆరోగ్యం కోసం సుమారు 10 వేల కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. తద్వారా మెత్తంగా 40 లక్షల మంది లబ్ధిపొందారని మంత్రి తెలిపారు. ప్రతి రోజూ ప్రభుత్వంపై కొన్ని పత్రికలు... అసత్య వార్తలు రాస్తున్నాయని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వంలో తొమ్మిది నెలల పాటు బిల్లులు పెండింగ్లో పెట్టారని తెలిపారు. అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 19 వరకూ ఒక్క మెడికల్ కాలేజి కూడా కట్టలేదని.. తమ ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నట్లు మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.