వైఎస్సార్సీపీ నేతల మూకుమ్మడి రాజీనామా - 'అదంతా డ్రామా' - మంత్రి ఆదిమూలపు సురేష్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 1:15 PM IST
Minister Adimulapu Suresh supportive leaders Drama In Prakasam District : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఇంఛార్జిగా కొనసాగించాలని నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు కొత్త నాటకానికి తెరలేపారు. వైసీపీ ఇంచార్జీల మార్పు ప్రకటించినప్పటి నుంచి 3 రోజుల వరకు ఎవరూ పట్టించుకోకుండా ఇప్పటికిప్పుడు నాయకులు రాజీనామాలు చేస్తామని స్వరం వినిపించారు. ఈ తతంగమంతా మంత్రి సురేష్ వెనుక ఉండి నడిపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
MLA Adimulapu Suresh Latest News : నియోజకవర్గ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులం అందరం మూకుమ్మడిగా రాజీనామా చెేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ప్రజలు కూడా ఆదిమూలపు సురేష్ కాకుండా మరే ఎమ్మెల్యేను ఇక్కడ ఆమోదించలేరని అన్నారు. వెంటనే అధిష్టానం వారి మనవిని ఆలకించాలని కోరారు. ఆదిమూలపు సురేష్‌ను కొండెపి ఇంఛార్జ్‌గా నియమించడంపై వారు అసమ్మతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి సురేష్ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని నాయకులు పేర్కొన్నారు.