Sarpanch house arrest: "ఎమ్మెల్యే ఏ ఒక్క పనీ చేయలేదు.. అడుగుతామంటే అరెస్టు చేస్తారా..?"
🎬 Watch Now: Feature Video
Sarpanch under house arrest: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని మిలియపుట్టి మండలం గోకర్ణపురం గ్రామ పంచాయతీ సర్పంచి రవికుమార్‌ను మిలియపుట్టి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గ్రామానికి వచ్చే ఎమ్మెల్యేను.. సర్పంచ్, స్థానిక ప్రజలు కలిసి అడ్డుకుంటారన్న ఆలోచనతో ముందుగానే మిలియపుట్టి పోలీసులు అక్రమ అరెస్టులకు తెరలేపారు. చిన్న హంస గ్రామంలో ఉన్న సర్పంచును గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవికుమార్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా తమ పంచాయతీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని.. ప్రశ్నించేందుకు వెళ్లే సమయంలో తమను ముందుగానే పోలీసులు గృహనిర్బంధం చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని కోరుకోవడం తప్పా అంటూ ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న తనను.. ఇలా అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. ఇటువంటి అక్రమ నిర్బంధాలను అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని సర్పంచ్ పేర్కొన్నారు.