Micro Irrigation Project: బిందు సేద్యం లక్ష్యం ఖరారు.. నెల్లూరు జిల్లా రైతులకు 3500 హెక్టార్లు
🎬 Watch Now: Feature Video
Micro Irrigation Project : బిందు, తుంపర్ల సేద్యం 2023- 24 ఆర్థిక సంవత్సరానికి 3500 హెక్టార్లు నెల్లూరు జిల్లా రైతులకు రాయితీపై ఇచ్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందని ఆంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ రైతులకు 90% రాయితీతో డ్రిప్ పరికరాలు అందజేస్తామన్నారు. ఐదు ఎకరాల లోపు రైతులకు 90 శాతం రాయితీ ఉంటుందన్నారు. ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులకు 70 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు అందజేస్తామని వెల్లడించారు. గడిచిన ఏడాది 7 డ్రిప్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, ఈ ఏడాది 10 డ్రిప్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రైతుకు ఏ డ్రిప్ కంపెనీ కావాలో ఆ డ్రిప్ కంపెనీ పరికరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులు గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.