గుంటూరు టు ఫిల్మ్ ఎడిటర్ వయా అమెరికా.. తొలి మహిళా ఎడిటర్ సృజన అడుసుమిల్లి - మేమ్ ఫేమస్ ఎడిటర్ సృజన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 30, 2023, 7:28 PM IST

Mem Famous Movie Editor Srujana Adusumilli Success Story : సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేదు... తెలిసిన వాళ్లు కూడా పెద్దగా లేరు... కానీ, సినిమాలు చూడటమంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే తనను సినిమా ఎడిటర్‌గా మారుస్తుందని అస్సలు ఊహించలేదు. మాస్టర్స్ చదివేందుకు అమెరికా వెళ్లినా... అక్కడి జీవితం నచ్చక తిరిగి వచ్చేసింది. దర్శకుడు శేఖర్ కమ్ముల, సందీప్ వంగా లాంటి వాళ్ల స్ఫూర్తితో సినిమాల వైపు రావాలనుకుంది. అప్పుడే ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ తనకు దారి చూపించింది. పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఎడిటింగ్ నేర్చుకున్న యువతి.. కొన్నాళ్లు సీనియర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వద్ద సహాయకురాలిగా పని చేసింది. ఆ అనుభవంతో ఇప్పుడు 'మేమ్ ఫేమస్' చిత్రానికి ఎడిటర్‌గా... తెలుగు సినిమా చరిత్రలో తొలి మహిళా ఎడిటర్‌గా పరిచయం అయ్యింది. తనే.. గుంటూరు జిల్లాకు చెందిన సృజన అడుసుమిల్లి. మరి ఈ రంగంలో తను ఎలాంటి ఒడిదొడుకులెదుర్కొంది.. ఎడిటర్‌గా ఎలా రాణిస్తోంది..? తొలి మహిళా ఎడిటర్‌ సృజనను అడిగి తెలుసుకుందాం.. పదండీ బాసూ!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.