ఆరోగ్యశ్రీ నిధుల్లో మార్కాపురం ఎమ్మెల్యే వెయ్యి కోట్ల అవినీతి : పెద్దిరెడ్డి - Markapuram MLA nagarjuna reddy
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 12:53 PM IST
|Updated : Dec 19, 2023, 1:32 PM IST
Markapuram MLA who is Guilty of Corruption : మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి బంధువులు అవినీతికి పాల్పడ్డారని వైసీపీ బహిష్కృత నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశ్రీ నిధుల్లో వెయ్యి కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. రోగులు లేకున్నా ఉన్నట్లు చూపించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నాగార్జున రెడ్డితో పాటు అతడి మామ శ్రీనివాస్‌రెడ్డి, బావమరిదిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని సూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపారు. వెెంటనే వారిపై సీబీఐ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు.
Appeal to Take Action Against MLA : ప్రభుత్వ పథకాల దారి మళ్లింపు చర్య కారణంగా కొన్ని కోట్ల రూపాయలు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అక్రమంగా సంపాదించడాన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. అన్ని ఆధారాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చారని తెలియజేశారు. ఎమ్యెల్యే నాగార్జున రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అధికార ప్రాబల్యంతో ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యేలు భ్రఘ్ట పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.