టీడీపీలో చేరిన మంగళగిరి వైసీపీ నాయకులు - కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన లోకేశ్ - టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 5:23 PM IST
Mangalagiri YCP Leaders Joined TDP: మంగళగిరి నియోజకవర్గంలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీలోని కీలక నేతలు ఆ పార్టీని వీడారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ తన పాదయాత్రతో రాష్ట్రంలో రగిలించిన ప్రజాచైతన్యం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోందని టీడీపీలో చేరిన నేతలు తెలిపారు. యువగళం జైత్రయాత్ర నవశకానికి నాంది పలికిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అయితే గతంలోనూ మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కీలక వైసీపీ నేతలు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు.
తాజాగా లోకేశ్ సమక్షంలో వైసీపీ నేతలైన గుంటూరు జిల్లా ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు సంకా బాలాజీ గుప్తా, మంగళగిరి మాజీ కౌన్సిలర్ మండ్రు రమాదేవి - మండ్రు రాము, మంగళగిరి వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం అధ్యక్షుడు పెండెం శివరామ కృష్ణ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. త్వరలో ఏర్పడబోయే ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకి మేలు జరుగుతుందని, రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం అంతా కలిసి పనిచేద్దామని నారా లోకేశ్ నేతలకు పిలుపునిచ్చారు.