వైసీపీకి సిద్దాంతాలు ఉండాలి- షర్మిలమ్మతోనే నా రాజకీయ జీవితం ముడిపడి ఉంది: ఆర్కే - ఆళ్లరామకృష్ణారెడ్డి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-12-2023/640-480-20389747-thumbnail-16x9-mangalagiri-mla.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 30, 2023, 12:42 PM IST
Mangalagiri MLA Alla Ramakrishna Reddy: అభివృద్ధి చేయకుండా సంక్షేమాన్ని నమ్ముకుంటే మళ్లీ అధికారంలోకి పార్టీ ఎలా వస్తుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కుప్పం, మంగళగిరి, భీమవరంలో అభివృద్ధి చేయకుండా 175 స్థానాలు ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆర్కే తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఆర్కే అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకపోవడం వల్లే వైసీపీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. అసలు వైసీపీ సిద్దాంతాలు ఉండాలన్నారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధినీ కోరుకుంటున్నారని, 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లను మాత్రమే కేటాయించారని ఆరోపించారు. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కోసం సీఎంవోకు పదే పదే వెళ్లి అడిగినా ప్రయోజనం లేదని తెలిపారు. తానే 8కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు.
తాను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తినని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటానని వెల్లడించారు. ఆమెతోనే తన రాజకీయ జీవితం ముడిపడి ఉందని తెలిపారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఆమె వెంటే తాను నడుస్తానని ఆర్కే పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తప్పు చేసినట్లు తేలితే న్యాయస్థానాల్లో కేసులు పెట్టేందుకు సైతం వెనుకాడనని ఆర్కే హెచ్చరించారు.