Man Dead Body found in Friends House in Proddatur: ప్రొద్దుటూరులో మృతదేహం కలకలం.. స్నేహితుడే చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడా..! - Young Man Suspected Death in proddatur
🎬 Watch Now: Feature Video
Man Dead Body found in Friends House in Proddatur: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని ఓ ఇంట్లో మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక ఈశ్వర్‌రెడ్డినగర్‌లోని ఓ ఇంట్లో సతీష్ అనే వ్యక్తి మృతదేహాన్ని ఇసుక నుంచి పోలీసులు వెలికితీశారు. నెల క్రితం తన ఇంట్లో గొడవపడిన సతీష్.. ఈశ్వర్‌రెడ్డి నగర్లో నివాసముంటున్న తన మిత్రుడైన కిషోర్ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన కిషోర్ తల్లి ఈ మధ్యే ప్రొద్దుటూరుకు వచ్చింది. తమ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని ఆమె గుర్తించింది. దీనిపై ఆమె తన కుమారుడ్ని ప్రశ్నించింది. దీంతో సతీష్ మరణించాడని.. అతని మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టానని కిషోర్ తన తల్లికి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కిషోరే తన స్నేహితుడైన సతీష్‌ను హత్యచేసి ఇంట్లో పూడ్చి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇంట్లో పూడ్చిన సతీష్ మృతదేహాన్ని బయటకు తీశారు. కిషోర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.