వైసీపీ ఎంపీ అనుచరుడి వేధింపులు- పోలీసులు పట్టించుకోవడంలేదంటూ, వ్యక్తి ఆత్మహత్యాయత్నం - AP Crime News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 10:36 PM IST

Man Commits Suicide Attempt Due to Harassment of YCP MP Follower: బాపట్ల ఎంపీ నందిగం సురేష్ (YCP MP Nandigam Suresh) అనుచరుడు రేపల్లె సన్నీ వేధింపులు భరించలేక గుంటూరుకు చెందిన షేక్ నౌషాద్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎంపీ సురేష్ అనుచరుడు సన్నీ తన సోదరుడిని, తనను మోసం చేయడమే కాకుండా నోటీసులు పంపించి బెదిరిస్తున్నట్లు బాధితుడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. రేపల్లె సన్నీ ఇసుక రీచ్ కాంట్రాక్ట్ వచ్చిందని నమ్మబలికి రూ 25 లక్షలు అప్పుగా తీసుకున్నారని బాధితుడు వెల్లడించారు. డబ్బుల కోసం రెండేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని బాధితుడు వీడియోలో వాపోయారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదన్నారు. చేసేది లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో విడుదల చేశారు. అనంతరం ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించగా ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.