కుమారుడు రోజూ కొడుతున్నాడని వ్యక్తి ఆత్మహత్యాయత్నం - వాటర్ ట్యాంక్ పైకెక్కి హల్‌చల్ - Man Commit Suicide in vangaya gudem
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 6:50 PM IST
Man Climbs Water Tank to Commit Suicide: ఏలూరు జిల్లా వంగాయగూడెంలో వాటర్ ట‌్యాంక్ పైకి ఎక్కి దూకేస్తానంటూ ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. పోలీసులు దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి అతన్ని కిందకి దింపారు.
Man Get Down after Persuaded by Police: ఏలూరు జిల్లా వంగాయ గూడెం సమీపంలోని జర్నలిస్ట్ కాలనీ వద్ద ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ శుక్రవారం కలకలం సృష్టించాడు. స్థానికులు ఎంత చెప్పినా అతను కిందకి దిగకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదు గంటలు శ్రమించి యువకుడికి నచ్చజెప్పి కిందకు దించారు. ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలను పోలీసులు యువకుడిని అడిగి తెలుసుకున్నారు. తన పేరు దుర్గారావు, లారీ క్లీనర్‌గా పనిచేస్తుంటాడు. ప్రతిరోజూ దుర్గారావు కుమారుడు, మరొక వ్యక్తి కలిసి కొడుతున్నారని ఆ భయంతోనే వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని దుర్గారావు తెలిపాడు.