ఇసుక ర్యాంపుల నిర్వహణలో అస్తవ్యస్తమైన విధానాలు - లారీ యజమానుల ఆందోళన - ఉమ్మడి గోదావరి జిల్లాల లారీ యూనియన్ నిరసన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 11:25 AM IST

Updated : Nov 29, 2023, 11:44 AM IST

Lorry Owners And Drivers Agitation In Sand Ramps: ఇసుక విధానంపై ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఇసుక ర్యాంపులో లారీ యూనియన్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం ఇసుక ర్యాంపుల నిర్వహణలో అస్తవ్యమైన  విధానాలు అవలంబిస్తుందని యూనియన్ నేతలు ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలోని ఇసుక ర్యాంపుల్లో... ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల లారీ యూనియన్ నేతలు, లారీ యజమానులు ఆందోళన చేపట్టారు. అక్టోబర్ 30న ఇసుక ర్యాంపులను మూసేసి ఈనెల 7వ తేదీ నుంచి రాంపుల్ని తెరిచారని పేర్కొన్నారు.  

జిల్లాకు ఒకటి, రెండు ర్యాంపులు మాత్రమే తెరవడంతో.. ఇసుక కొరత ఏర్పడిందని యూనియన్ నేతలు వెల్లడించారు. జోన్‌ వన్‌ను ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అప్పగించినట్లు వార్తలు వచ్చినా.. ఇప్పటికీ జేపీ కంపెనీ బిల్లులతోనే ఇసుక లోడ్‌ చేస్తున్నారని తెలిపారు. చిన్న లారీకి 10 టన్నులు, 5 యూనిట్ల వాహనానికి 18 టన్నులు, ఆరు యూనిట్ల వాహనానికి ఇరవై టన్నులు అని చెప్పి ఇసుకను తక్కువగా లోడ్ చేసి పంపుతున్నారని యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఇసుక విధానాన్ని సవరించాలని కోరారు.  రాష్ట్రంలో ఉన్న అన్ని ఇసుక ర్యాంపులు తెరవాలని డిమాండ్ చేశారు. అలాగే లారీ ఓనర్లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని.. లారీ యజమానులు డిమాండ్ చేశారు. 

Last Updated : Nov 29, 2023, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.