Lorry Accident in Prakasam District : రోడ్డు పక్కన టీస్టాల్​ లోకి దూసుకొచ్చిన లారీ.. ఆ సమయంలో..! - కంభం వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2023, 1:27 PM IST

Lorry Accident in Prakasam District : ప్రకాశం జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. కంభం మండలంలోని జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన లారీ.. రెండు విగ్రహాలను ఢీ కొట్టి.. పక్కనే ఉన్న టీ స్టాల్​లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవటం వల్ల ప్రాణ నష్టం జరగలేదు.

మండలంలోని జంగం గుంట్ల గ్రామ సమీపంలోని అమరావతి- అనంతపురం జాతీయ రహదారిపై ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆంజనేయ స్వామి విగ్రహాలను.. లారీ బలంగా ఢీ కొట్టడం వల్ల ఆ విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. పక్కనే ఉన్న మరో టీ స్టాల్​ని కూడా లారీ ఢీకొట్టింది. దీంతో టీ స్టాల్ పాక్షికంగా దెబ్బతింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి లారీని నడపటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఘటన సమయంలో ఎవరూ లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.