Lokesh Rachabanda Program with Mallavalli Villagers : మల్లివల్లి పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తాం : నారా లోకేశ్ - Yuvagalam Padayatra News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2023, 7:35 PM IST
Lokesh Rachabanda Program with Mallavalli Villagers : బస్సులు, లారీలు తయారు చేసే అశోక్ లేలాండ్ పరిశ్రమను నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా మల్లవల్లికి తీసుకొస్తే (Ashok Leyland in Mallavalli) , సీఎం జగన్ మోహన్ రెడ్డి జేసీబీ దెబ్బకి అది కాస్తా వెనక్కు మళ్లిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామస్థులతో.. లోకేశ్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అశోక్ లేలాండ్ పరిశ్రమ ఏర్పాటైతే స్థానికంగా 7వేల మందికి ఉపాధి లభించేదని తెలిపారు. మల్లవల్లికి 700 పరిశ్రమలు చంద్రబాబు తెస్తే, పాలిచ్చే ఆవుని కాదని తన్నే దున్నపోతు తెచ్చుకున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తూ మల్లవల్లి పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తామని (Develop Mallivalli Industrial Area) హామీ ఇచ్చారు. తెలుగుదేశం సైకిల్లో ఒక చక్రం అభివృద్ధి అయితే మరో చక్రం సంక్షేమమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరగటానికి కారణం సైకో జగన్ కాదా అని లోకేశ్ ప్రశ్నించారు.