Lokesh Promised to Link Mango Crop With MGNREGS: మామిడి పంటను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం..! నారా లోకేశ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2023, 8:53 PM IST
Lokesh Promised to Link Mango Crop With MGNREGS: జగన్ ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోకపోవడంతో.. తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరులో మామిడి రైతులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భేటీ నిర్వహించారు. మామిడి పంటను ఉపాధి హామీ పథకంతో(Mahatma Gandhi National Rural Employment Guarantee) మొదటి మూడేళ్లు అనుసంధానం చేసే అవకాశం ఉందని.. అది ఖచ్చితంగా చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధునాతన మామిడి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి కొత్త మామిడి రకాలను అభివృద్ది చేస్తామన్నారు. ఇతర దేశాలకు కావాల్సిన రకాలూ ఇక్కడ పెంచే అవకాశాలు ఉన్నాయని.. అధికారంలోకి వచ్చిన వెంటనే పల్పింగ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని లోకేశ్ తెలిపారు. నూజివీడు ప్రాంతంలో ఉన్న రీసెర్చ్ సెంటర్‌ని బలోపేతం చేస్తామన్నారు.
మామిడి అమ్మకానికి మార్కెట్ లింక్ చేస్తామని, పెద్ద సంస్థలతో డైరెక్ట్‌గా ఒప్పందం చేసుకుని.. రైతుకి లబ్ది చేకూరేలా చూస్తామని వివరించారు. మామిడి పంటకి మెరుగైన ఇన్స్యూరెన్స్(Insurance) పథకం అమలు చేయాల్సిన అవసరముందన్నారు. పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న మెలైన విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో మామిడి పంటకు భీమా అమలు చేస్తామన్నారు. నూజివీడు, తిరువూరు, మైలవరం మామిడి రైతులకు లాభాలు వచ్చేలా స్థానికంగా మార్కెట్, కోల్డ్ స్టోరేజ్, రైపినింగ్ ఛాంబర్స్(Ripening chambers) ఏర్పాటు చేస్తామని లోకేశ్ తెలిపారు. మామిడి బోర్డు ఏర్పాటుపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీడీపీ హయాంలో మామిడి రైతులకు డ్రిప్, ఫ్రూట్ కవర్, ఇతర పనిముట్లు సబ్సిడీలో ఇచ్చామని గుర్తు చేశారు. జగన్ పాలనలో గిట్టుబాటు లేక రోడ్డు మీద పారబోసిన రోజులు ఉన్నాయని.. పురుగుల మందులు, ఎరువుల ధరలు అధికమయ్యాయని రైతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.