Lokesh Lunch Motion Petition in AP High Court: లోకేశ్ ఫైబర్ గ్రిడ్ కేసు.. ముందస్తు బెయిల్‌కు.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. - ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2023, 1:40 PM IST
Lokesh Lunch Motion Petition in AP High Court: ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటీషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. వ్యాజ్యంపై మధ్యాహ్నం విచారణ జరపనుంది. ఇప్పటికే ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం ఈనెల 4 వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు అత్యవసరంగా ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. అమరావతి రింగ్ రోడ్ కేసులో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులో నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. హెరిటేజ్‌కు సంబంధించిన దస్త్రాలను తీసుకురమ్మని అనటం.. ఇతర నిబంధనలపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఈనెల 4వ తేదీ విచారణకు హాజరుకావాలని ఇటీవల లోకేశ్‌కు సీఐడీ 41 ఏ నోటీసులు జారీ చేసింది.