thumbnail

కష్టాల కొలిమిలో మిర్చి రైతు - వర్షాభావం, తెగుళ్లతో తీవ్ర నష్టం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 17, 2023, 7:19 PM IST

Locust Pest of Chilli Garden : మిరప పంటకు ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లాలో వర్షాలు లేక, కాల్వలకు నీరు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లా మేడికొండకు చెందిన గుర్రపు బ్రహ్మయ్య అనే రైతు.. సాగు నీరు లేక, బొబ్బర తెగులు ఎక్కువగా ఉందని మిరప తోటకు పంటను పీకేశారు. ఒక్కో ఎకరాకు రూ.20 వేలు చొప్పున.. 8 ఎకరాలు కౌలు తీసుకుని మిర్చి పంటను సాగు చేశాడు. పంటకు వచ్చిన తెగులు తగ్గడానికి.. మందులు పిచికారీ చేసినా ఫలితం దక్కకపోవడంతో చేసేదేమీ లేక మిరప మొక్కలను తొలగించే పరిస్థితి ఏర్పడింది. ఎకరాకు రూ.60వేల దాకా పెట్టుబడి పెట్టి నష్టపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవాలని బ్రహ్మయ్య కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు అంతర్జాతీయంగా మారుతున్న పరిమాణాల కారణంగా గుంటూరు మిర్చి యార్డులో ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో ఎగుమతులు భారీగా తగ్గి.. క్వింటా మిర్చి ధర రూ.500 నుంచి రూ.1000 వరకు పడిపోయింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.