అధికార పార్టీకి అనుకూలంగా బీఎల్ఓలు -'మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి!' - blo ycp leaders deleting votes in dharmavaram
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 4:11 PM IST
Locals Protest at RDO Office: అధికార పార్టీ ఓటమి భయంతో ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపడుతుందని బీజేపీ(BJP) నాయకులు ఆరోపించారు. దొంగ ఓట్లు, వలస కూలీల పేరిట స్థానికంగా నివాసం ఉంటున్న వారి ఓట్లను తొలగింపు జాబితాలో చేరుస్తున్నారని ఆందోళనకు దిగారు.
Deletion of Votes in Satya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజవర్గంలో ఓట్ల తొలగింపుపై ఆర్డీవో కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు ధర్నా చేశారు. అధికార పార్టీ నాయకులు, బిఎల్వో(BLO)లు కలిసి అర్హుల ఓట్లు తొలగిస్తున్నారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఓట్ల తొలగింపులో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వారి ఇష్టానుసారం జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఎల్ఓలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తే ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని అధికారులు సమాధానమిస్తున్నారని బాధితులు తెలిపారు. సర్పంచ్ స్వయంగా బీఎల్ఓను ఇంట్లో కూర్చోబెట్టుకుని ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారని స్థానికులు తెలుపుతున్నారు.