కొండపై చిరుత హల్ చల్- వీడియో వైరల్ - చిరుత పులి సంచారం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-12-2023/640-480-20155593-thumbnail-16x9-leopard-roamed-and-noise-in-hill-in-satyasai-district.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 8:54 AM IST
Leopard Roamed And Noise In Hill In Satyasai District: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణ నడిబొడ్డున ఉన్న కొండ మీద చిన్నపాటి గృహ వద్ద సాయంత్రం ఒక చిరుత పులి అటు ఇటు తిరుగుతూ హల్ చల్ చేసింది. కొండ మీద ఉన్న చిరుతను కింద నుంచి చూసిన స్థానికులు ఒక్కసారిగా రోడ్లపై గుమిగూడారు. దూరంగా ఉన్న చిరుతను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. చాలా సేపు చిరుత అక్కడే సంచరించింది. సూర్యుడు అస్తమించే సమయంలో చిరుత పులి అక్కడి నుంచి కొండ వెనుక భాగం వైపు వెళ్లిపోయింది.
కొండ చుట్టూ నివాసం ఉంటున్న స్థానికులు ఎప్పుడు వచ్చి చిరుత దాాడి చెేస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. చిరుత నుంచి ఏ క్షణం ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ప్రజలు హడలిపోతున్నారు. వన్యప్రాణులు అడవుల నుంచి ప్రజలు నివసించే ప్రాంతాల్లోకి రాకుండా అటవీశాఖ అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. చిరుత నుంచి ఏ ప్రమాదం జరుగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.