ఇసుకను తరలింపును అడ్డుకున్న గ్రామస్థులు - అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ - అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2023, 6:57 PM IST
Leaders Transporting Sand Illegally : అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం జంబుగానిపల్లె గ్రామస్థులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. మూడేళ్లుగా పాపాఘ్ని నదిలో ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. దీనిపై నెల క్రితం అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారని తెలిపారు. మళ్లీ వచ్చి బెదిరింపులకు పాల్పడి ఇసుకను తరలించడం వల్ల అడ్డుకున్నామని చెప్పారు. వ్యవసాయ పొలాల్లో ఉన్న బోర్లు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు సంబంధిత అధికారులను కోరారు.
Locals are Concerned that Crop Fields will be Damaged : ఇసుక అక్రమాలను అడ్డుకుంటున్న గ్రామస్థులను అధికార నేతలు బెదిరిస్తున్నారని ఆవేదను వ్యక్తం చేశారు. ఇలా ఇసుకను అక్రమంగా తరలిస్తే నదికి సమీపంలో ఉన్న పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని వాపోతున్నారు. అధికారులు వారికి అడ్డుకట్ట వేయకుంటే గ్రామాన్ని విడిచి పెట్టి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితి వస్తుందని తెలియజేశారు. తమకు సరైన న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.