Lawyers Protest for CBN in District Courts : చిత్తూరు, అనంతపురం జిల్లా కోర్టుల ఎదుట న్యాయవాదుల ఆందోళనలు - అనంతపురం తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 15, 2023, 5:56 PM IST
|Updated : Sep 15, 2023, 7:02 PM IST
Lawyers Protest for CBN in District Courts : అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లా కోర్టుల ఎదుట ఆందోళనలు చేపట్టారు. సంఘీభావంగా ప్లకార్డులను పట్టుకొని 'మేము సైతం' చంద్రబాబుతోనే అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా జగన్ పరిపాలన ఉంటుందని న్యాయవాదులు మండిపడ్డారు.
Palamaner Lawyers Protest : చిత్తూరు జిల్లా పలమనేరులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ న్యాయవాదులు కోర్టు ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు సంఘీభావంగా ప్లకార్డులను చేతబట్టి మేము సైతం చంద్రబాబుతోనే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోర్టు దగ్గర నుంచి జాతీయ రహదారి వరకు ర్యాలీగా వస్తున్న న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో న్యాయవాదులకు పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. తాము నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా అంటూ పోలీసుల తీరుకు నిరసనగా న్యాయవాదులు నినాదాలు చేశారు.
Anantapur District court: అనంతపురం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు చంద్రబాబు నాయుడు అరెస్టుకు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పరిపాలన సాగిస్తున్నారని న్యాయవాదులు మండిపడ్డారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారంటూ నినాదాలు చేశారు. చట్ట నిబంధనలు పాటించకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను సైతం చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి వస్తే అడ్డుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను అణగదొక్కడమే ఈ వైకాపా ప్రభుత్వ పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో ఈ జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని న్యాయవాదులు తెలిపారు.