Advocate Interview on CBN Bail and Custody Petition: చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు: న్యాయవాది బత్తుల రామకోటయ్య - న్యాయవాది బత్తుల రామకోటయ్య ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-10-2023/640-480-19698361-thumbnail-16x9-advocate-interview-on-cbn-bail-and-custody-petition.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 5:26 PM IST
Advocate Interview on CBN Bail and Custody Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను, సీఐడి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన కస్టడి పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరఫున ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినిపించారు. రెండు పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేస్తూ సోమవారం తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే కోర్టులో వాదనలు వాడీవేడిగా సాగినట్లు తెలుస్తోంది. దీనిపై కోర్టులో జరిగిన వాదనల గురించి న్యాయవాది బత్తుల రామకోటయ్య పలు కీలక విషయాలు తెలిపారు. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినట్లు తమకు అనిపిస్తోందని అన్నారు. అదే విధంగా సీఐడీ వాళ్లు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, సీఐడీ తరఫున వాదనలు ఏ విధంగా జరిగాయనే దానిపై బత్తుల రామకోటయ్యతో మా ప్రతినిధి ముఖాముఖి.