Suryalanka Beach: సూర్యలంక తీరానికి.. పోటెత్తిన పర్యాటకులు - bapatla beach videos
🎬 Watch Now: Feature Video
Suryalanka Beach: బాపట్ల జిల్లాలోని సూర్యలంక సముద్ర తీరానికి పర్యాటకులు పోటెత్తారు. రంజాన్ పండుగ మరుసటిరోజు ఆదివారం కావటంతో బాపట్ల జిల్లాతో పాటు, గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల నుంచి పెద్దయెత్తున పర్యాటకులు సముద్రతీరానికి చేరుకున్నారు. సూర్యలంక సముద్ర తీరంలో చిన్నారులు యువకులు ఆనందంగా ఉత్సాహంగా గడిపారు రంజాన్ మాసం ముగియడంతో.. అనేక మంది ముస్లింలు విచ్చేసి సముద్రస్నానాలు చేశారు.
ప్రతి ఏటా ఈ తీరానికి ఇదొక సంప్రదాయం.. రంజాన్ పండుగ మరుసటి రోజు వేలాదిమంది ముస్లింలు సూర్యలంక సముద్ర తీరానికి వస్తుంటారు. అనాదిగా ఇదొక సంప్రదాయంగా వస్తోంది. ఈసారి ఆదివారం కావడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగింది. దీంతో సూర్యలంక సముద్ర తీరం కిటకిటలాడుతూ కనిపించింది. ఇప్పటికే వేసవి కాలం కావడంతో అనేకమంది పర్యాటకులు సముద్రతీరానికి వస్తున్నారు.
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తప్పిపోయిన ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు. అవే విధంగా సముద్ర తీరానికి వచ్చే మార్గంలో.. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.