₹8లక్షల విలువైన భూమిని 60వేలకే ఇచ్చాడు - అయినా అవార్డుతో సరిపెట్టి పరిహారం ఇవ్వని ప్రభుత్వం - anantapur kadiri road expansion compensation

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 5:17 PM IST

Land Looser Victim in Anantapur: రహదారి విస్తరణ కోసం ఇచ్చిన భూమి పరిహారం నాలుగున్నర ఏళ్లైనా రాలేదని, అధికారుల వద్దకు వెళ్తే ముప్పుతిప్పలు పెడుతున్నారని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం - కదిరి రహదారిని నాలుగున్నరేళ్ల కిందట నాలుగు వరుసలుగా మార్చేందుకు సూర్యనారాయణ (బాధితుడు) భూమి ఇచ్చాడు. నాలుగున్నర ఏళ్లైనా నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 

Land Compensation Has not Received for Four Half Years: అనంతపురం జిల్లాలో నాలుగున్నరేళ్ల క్రితం అధికారులు రహదారిని నాలుగు వరుసలుగా మార్చే పనులు ప్రారంభించారు. రహదారి నిర్మాణ సమయంలో సూర్యనారాయణ భూమి కొలతలు తీసుకొని, పరిహారం ఇస్తామని రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. అప్పట్లో సెంటు రూ.8 లక్షలు చేసే స్థలాన్ని రహదారి కోసం రూ.60 వేలకే ఇవ్వటానికి అతను ముందుకు వచ్చాడు. భూమిని కోల్పోయిన ఆయనకు ప్రభుత్వం అవార్డు ప్రదానం చేసి రూ.56 లక్షలు ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో ప్రభుత్వం నగదు జమ చేస్తామని చెప్పి నేటికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి రాగానే ఇస్తామంటున్నారని బాధితుడు వాపోతున్నారు. గతంలో ఉన్న కలెక్టర్‌కు పది సార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందించడం లేదని, మరోసారి స్పందనలో జిల్లా కలెక్టర్‌ గౌతమిని కలిసి తనకు పరిహారం ఇప్పించాలని కోరినట్టు బాధితుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.