Kundu river In Kadapa is Heavily Flowing with Floods : 33 వేల క్యూసెక్కుల నీటితో కుందూనది పరవళ్లు... - ఆంధ్రప్రదేశ్ వాతావరణం తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 12:15 PM IST

Kundu river In Kadapa is Heavily Flowing with Floods : గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వైఎస్ఆర్ జిల్లాలోని కుందూనదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్నూలు, నంద్యాల వైఎస్ఆర్ జిల్లాల్లో కురుస్తున్న వానల ప్రభావంతో కుందూ నదిలో నీటి మట్టం పెరిగింది. వరదలతో నది ఉరకలు వేస్తోంది. నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల సరిహద్దులోని రాజోలు ఆనకట్ట వద్ద ఆదివారం ఉదయం 11 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా, ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లా  సరిహద్దు పరివాహక ప్రాంతంలో ఉన్న రాజోలి  సమీపంలో కుందూ నదిలో అదే రోజూ సాయంత్రానికి నీటి మట్టం 33,016 క్యూసెక్కులకు చేరుకుంది.  

kundu River Flowing in Nandyala : వానలతో వాగులు, వంకలు నిండిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం తెల్లవారు జాము నుంచి విరామం లేకుండా కురిసిన వానలకు వరద ఉద్ధృతి పెరిగింది. ఎటువంటి ప్రాణహాని జరగకుండా నియంత్రించేందుకు ఈ మార్గంలో ప్రజలు ప్రయాణించకుండా పోలీసులు పహరా కాశారు. వర్షం తగ్గుతున్న కారణంగా నదిలో నీటి  ప్రవాహం కొద్ది కొద్దిగా తగ్గుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.