One Dead After Lorry Hits Shop in Vizag Town : విశాఖ నగరం గాజువాక మండలంలోని లారీ బీభత్సం సృష్టించింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావటంతో దగ్గరలో ఉన్న దుకాణంలోకి నేరుగా దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తృటిలో ప్రమాదం తప్పినట్లయింది.
లారీని ఢీ కొని ఒకరి మృతి: గాజువాకలోని శ్రీనగర్ దగ్గర సుందరయ్య కాలనీలో ఇసుక లోడుతో లారీ వెళ్తుండగా ఉన్నట్టుండి దాని లారీ బ్రేకులు ఫెయిల్ కావటంతో కొండవాలు రోడ్డు ఎదురుగా ఉన్న జిరాక్స్ షాపులోకి దూసుకుపోయింది. దాంతో ఐస్ క్రీం తీసుకునేందుకు వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి రమణను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అదే దుకాణానికి కూరగాయలు కొనడానికి వచ్చిన మరో మహిళ లారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజిని పోలీసులు విడుదల చేశారు.
"గాజువాకలోని సుందరయ్య కాలనీ వద్ద ఈరోజు ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతం వైపు ఓ ఇసుక లారీ వస్తుండగా హఠాత్తుగా దాని బ్రేకులు ఫెయిలై అది నేరుగా దగ్గర్లో ఉన్న దుకాణంలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి రమణ(58) మృతి చెందాడు. మరో మహిళ తృటిలో ప్రాణాల నుంచి తప్పించుకుంది. దగ్గరలో దుకాణ యజమాని లేకపోవడంతో కొంత మేర ప్రమాదం తప్పినట్లయింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం". -ట్రాఫిక్ పోలీసులు, గాజువాక
Vehicle hits ACP Office In Vizag District: ఎండాడ కూడలిలోని నార్త్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయం ప్రాంగణంలోకి మద్యం తరలించే వాహనం దూసుకెళ్లింది. దీనిపై ట్రాఫిక్ సీఐ నల్లి సాయి తెలిపిన వివరాల ప్రకారం ఆనందపురంలోని మద్యం నిల్వల కేంద్రం (బెవరేజ్ స్టోరేజ్) నుంచి సాగర్‌నగర్ ప్రాంతంలోని ఓ దుకాణానికి బొలెరో వాహనంలో సోమవారం సాయంత్రం మద్యం తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎండాడ కూడలి వద్దకు వచ్చేసరికి వాహనానికి బ్రేకులు పని చేయలేదు.
ఈ నేపథ్యంలో పెను ప్రమాదాన్ని ఊహించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని ఏసీపీ కార్యాలయం ప్రాంగణంలోకి మళ్లించాడు. రెండు చెట్లను ఢీకొట్టిన వాహనం అక్కడే ఆగిపోయింది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలవ్వడంతో వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బస్సు, ట్రక్కు ఢీ- 19 మంది మృతి, మరో 18 మందికి గాయాలు
రెండు లారీల మధ్య నలిగిపోయిన బైక్- భార్యాభర్తలు మృతి- చిన్నారులు సేఫ్