ETV Bharat / state

రాష్ట్రంలో పింఛన్ల పండుగ - ఇంటింటికెళ్లి నగదు అందజేసిన ప్రజాప్రతినిధులు - PENSIONS DISTRIBUTION IN AP

నూతన సంవత్సరం కానుకగా రాష్ట్రంలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ - కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

pensions_distribution_in_ap
pensions_distribution_in_ap (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2024, 8:37 PM IST

Updated : Dec 31, 2024, 10:57 PM IST

NTR Bharosa Pensions Distribution: రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఎన్టీఆర్​ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. నూతన సంవత్సరం కానుకగా ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్ము అందజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్​ భరోసా పింఛన్ల పంపిణీ కోలాహలంగా సాగింది. ఒకరోజు ముందుగానే పింఛన్‌ సొమ్ము పంపిణీ చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 63,78,000 మందికి 2,717 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది. లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్‌ చేసిన ప్రభుత్వం సిబ్బంది నేరుగా ఇంటివద్దకే వెళ్లి పింఛన్‌ సొమ్ము అందజేస్తున్నారా లేదా అన్నది పరిశీలించింది.

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. నందిగామలో ప్రభుత్వ విప్‌ తంగిరాల సౌమ్య, గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరిగింది. కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెల్లవారుజాము నుంచే అధికారులతో కలిసి వార్డుల్లో తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. ముండ్లమూరు మండలం పసుపుగల్లులో దర్శి టీడీపీ ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు.

పింఛన్ పంపిణీ చేసి - కాఫీ కలిపి లబ్ధిదారులకు ఇచ్చిన చంద్రబాబు

ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లోనూ పింఛన్ల పంపిణీ ఉత్సాహంగా సాగింది. శ్రీకాకుళం జిల్లా దీనబంధుపురంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. పెద్ద తామరపల్లి నుంచి కొండ ప్రాంతంలోని పలు గ్రామాల మీదుగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి ప్రజల్లో ఉత్సాహం నింపారు. కొరసవాడలో కలెక్టర్‌ దినకర్ స్వప్నిల్‌ పుడ్కర్‌తో కలిసి ఎమ్మెల్యే గోవిందరావు పింఛన్లు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా జొన్నవలసలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

విశాఖ జిల్లా సింహాచలంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. గోపాలపట్నంలో ఎమ్మెల్యే గణబాబు ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ సొమ్ము పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా రూపా నాయక్ తండాలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ పింఛన్లు పంపిణీ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ, అడదాకులపల్లిలో మంత్రి సవిత ఇంటింటికి వెళ్లి పింఛన్ల సొమ్ము అందజేశారు. కొత్తచెరువులో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మడకశిరలో ఎమ్మెల్యే ఎంస్​ రాజు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రెడ్డిపల్లిలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి పింఛన్‌దారులకు సొమ్ము అందజేశారు.

దర్శనం టికెట్ బుక్ చేసుకుని వెళ్లకపోతే మరో అవకాశం? - టీటీడీ ఈవో ఏమన్నారంటే!

'మన కోసం బతికేవాళ్లు ఉన్నారు - అవి అవసరమా డార్లింగ్స్' - ప్రభాస్ న్యూఇయర్ మేసేజ్

Last Updated : Dec 31, 2024, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.