Villagers fire on MLA Bhagya Lakshmi: ఓట్ల కోసం వస్తే బుద్ధి చెబుతాం.. ఎమ్మెల్యేపై గ్రామస్థుల ఆగ్రహం - ap latest news
🎬 Watch Now: Feature Video
Kudumula villagers fire on MLA Bhagya Lakshmi: గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు 'గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం' నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేతలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నిరసన సెగలు తగలడం సర్వసాధారణం అయిపోయింది. ఈ తరుణంలో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తారని, సమస్యలు చెప్పుకుందామని ఎదురు చూసిన కుడుముల గ్రామస్థులకు నిరాశ మిగిలింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయితీ కుడుములలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి 'గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి' వస్తారని గ్రామస్థులు ఎదురు చూశారు. ఎంతసేపు ఎదురు చూసినా ఆమె రాకపోవటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన తరువాత ఒక్కసారి కూడా తమ గ్రామానికి రాలేదని, ఈ కార్యక్రమానికి కూడా ఎందుకు రాలేదని మహిళలు ప్రశ్నించారు. సమస్యలు వివరించటం కోసం మహిళలు, గ్రామస్థులు టెంట్లు ఏర్పాట్లు చేశారు. వర్షాలతో దారులన్నీ చిత్తడిగా, బురద మయంగా ఉండటంతో కోరుకొండ వరకు వచ్చిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.. కుడుములకు రాకుండా వెనక్కి వెళ్లిపోయారు. రహదారి, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు అడగడం కోసం ఎదురు చూశామని.. ఈ సారి ఓట్ల కోసం వస్తే సరైన బుద్ధి చెబుతామని కుడుముల గ్రామస్థులు హెచ్చరించారు.