సంగీతం, ఆంధ్ర సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలి - కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ - Union Minister Nirmala Sitharaman comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 4:48 PM IST

Updated : Dec 10, 2023, 6:18 PM IST

Krishnaveni Sangeet Neerajanam Program Updates: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తోన్న కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ హాజరయ్యారు. సంగీతాన్ని, ఆంధ్ర సంస్కృతిని విశ్వ వ్యాప్తం చేయడానికి అందరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌లో తాను సంగీతం వినడానికి ఎక్కువ సమయం కేటాయించానని, దాంతో విజ్ఞానం, ప్రశాంతత కలిగిందని ఆమె పేర్కొన్నారు.  

Union Minister Nirmala Sitharaman Comments: రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో మూడు రోజుల పాటు కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ సంగీత విద్యాంసులు పాల్గొననున్నారు. ఈ క్రమంలో మొదటి రోజు కార్యక్రమానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు రాష్ట్ర మంత్రులు రోజా, బుగ్గన, వీఎంసీ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగిస్తూ.. ''సంగీతాన్ని విశ్వ వ్యాప్తం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఆంధ్రప్రదేశ్‌కు కళలను ప్రోత్సహించడం, ఆదరించడంలో గొప్ప చరిత్ర ఉంది. గతంలో సంగీతానికి మన దేశంలో మంచి ఆదరణ ఉండేది. కానీ, కొంతకాలంగా ఆ ఆదరణ తగ్గింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో సంగీతం నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా సమయంలో నేను ఆన్‌లైన్‌లో సంగీతం వినడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. దాంతో నాకు విజ్ఞానం, ప్రశాంతత లభించింది. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి సంగీతం ఎంతో దోహదం చేస్తుంది.'' అని ఆమె అన్నారు.

Last Updated : Dec 10, 2023, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.