ఉప్పొంగిన కొండవీటి వాగు - చెరువులను తలపిస్తున్న పంట పొలాలు - గుంటూరు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 4:28 PM IST
Kondaveeti Stream Overflowed in Guntur District : గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేయడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఇటీవల మిగ్జాం తుపాను కారణంగా కురిసిన వర్షాలకు కొండవీటి వాగు పొంగిపొర్లి చుట్టూ ఉన్న పొలాలను ముంచెత్తింది. తాడికొండ మండలంలోని వేలాది ఎకరాల్లో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పంటలు నీట మునిపోవడం వల్ల భారీగా నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
Neglect of The Government : కొండవీటి వాగులో తూటి ఆకు పేరుకుపోయి నీరు ముందుకు కదలేని కారణంగానే పంట పొలాలు చుట్టూ వరదవచ్చి చేరిందని రైతులు పేర్కొన్నారు. ఒక్కో ఎకరాకు 30 వేల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పుడు చిల్లిగవ్వ కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తమ పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నారు.