విచారణ సంస్థల పట్ల సీఎం జగన్కు ఎలాంటి గౌరవం లేదు: కొలికపూడి శ్రీనివాసరావు - టీడీపీ నేత కొలికపూడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 4:20 PM IST
Kolikapudi Srinivasa Rao: సీబీఐ, సీఐడీ వంటి విచారణ సంస్థల పట్ల సీఎం జగన్కు ఎలాంటి గౌరవం లేదని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. సీఐడీ విచారణలో భాగంగా రెండోసారి గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి టీడీపీ నేత పట్టాభి, న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. విచారణ సంస్థల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది కాబట్టే అక్రమ కేసైనా సహకరిస్తున్నామని అన్నారు. సీఎం జగన్ 381 సార్లు కోర్టు విచారణను తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపించారు. మరో నాలుగు నెలల్లో దిగిపోయే ప్రభుత్వానికి తాము భయపడే పరిస్థితులు లేవని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబాల పట్ల ప్రభుత్వం అవమానకర రీతిలో వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.
ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న కొలికపూడి శ్రీనివాసరావుపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని తెలుగుదేశం నేత పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులతో బెదిరించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆరోపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని పట్టాభి తెలిపారు. వైఎస్సార్సీపీకి అనుకులంగా ఉన్నవారిపై ఎలాంటి కేసులు ఉండవా అంటూ ప్రశ్నించారు.