జగన్ అధికారంలోకి రావడానికే కోడికత్తి కుట్ర ఘటన- న్యాయవాది సలీమ్ - ys jagan
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-01-2024/640-480-20501572-thumbnail-16x9-kodi-kathi-case.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 13, 2024, 8:18 PM IST
Kodi Kathi Case: కోడి కత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని హైకోర్టు న్యాయవాది సలీమ్ కోరారు. కోడి కత్తి కేసు శ్రీను కేసు రద్దు చేయాలని కోరుతూ నిందితుడి తల్లి సావిత్రమ్మ,దళిత సంఘాల నాయకులు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో కోడి కత్తి శీను తల్లి సావిత్రమ్మ, అన్నయ్య, లాయర్లు, దళిత సంఘాలు నాయకులు హాజరయ్యారు. జగన్ అధికారంలోకి రావడానికి ఈ కుట్ర చేశారని న్యాయవాది అన్నారు.
ఘటన జరిగి ఐదు సంవత్సరాలు దాటినా శ్రీను జైల్లోనే ఉన్నారని అన్నారు. అయిదు సంవత్సరాలుగా శ్రీనును జైల్లో ఉంచి, దళితులని సీఎం జగన్ మోహన్ రెడ్డి తక్కువ చేస్తున్నారని మండిపడ్డారు. కోడి కత్తి కేసును వెంటనే రద్దు చేయాలని న్యాయవాది సలీమ్ అన్నారు. కోడి కత్తి శ్రీను కేసును రద్దు చేయకపోతే దళితులందరూ రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అమాయకుడైన తన కుమారుడిని విడిపించాలని శ్రీను తల్లి సావిత్రమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.