నదీ తీరాల్లో కార్తిక కాంతులు, భక్తి శ్రద్ధలతో దీపారాధన - తూర్పుగోదావరి జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2023, 10:23 AM IST
Karthika Masam in Celebrations East Godavari District: పరమశివుడికి ప్రీతికరమైన కార్తీకమాసం ప్రారంభం కావటంతో తొలిరోజు నదీ తీరాలు, కాలువలు దీపారాధనలతో వెలుగులమయంగా మారాయి. ఈ మాసంలో భక్తిశ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తే కోరుకున్నవారికి కొంగుబంగారమవుతుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో నదీతీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు.. అరటి దొప్పలపై దీపాలు వెలిగించి నీటిలో వదిలారు. మహిళలు భక్తి శ్రద్ధలతో వెలిగిస్తున్న దీపారాధనతో నదీతీరం అధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Karthika Masam 2023: తూర్పు గోదావరి జిల్లాలోని నదీ తీర ప్రాంత గ్రామాలు మొత్తం వెలుగులు మయమయ్యాయి. ఉండ్రాజవరం సుబ్బారాయుడి కాలువ తీరంతో పాటు తీపర్రు, కాకరపర్రు తదితర గ్రామాల నదీతీరాలలో దీపాలు వెలిగిస్తున్న భక్తులతో ఆ ప్రాంతాలలో సందడి వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున నుంచి భక్తులు దీపాలు వెలిగిస్తూ దీపలక్ష్మి పూజలు చేశారు. కార్తీకమాసంలో అగ్ని సంబంధమైన పూజలు చేస్తే శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. ప్రతి ఏడాది దీపావళి మరుసటిరోజు నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది.