Tholiprema Rerelease: 'తొలిప్రేమ' రీ రిలీజ్.. స్క్రీన్ చించేసిన అల్లరి మూక.. రాజకీయ కుట్ర అంటున్న జనసేన - Mahesh comments on Kaparthi theater destruction
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2023/640-480-18890042-63-18890042-1688212061779.jpg)
Kaparthi movie theater destroyed: విజయవాడ కపర్థి సినిమా ధియేటర్లో నిన్న తొలిప్రేమ సినిమా ప్రదర్శించారు. సెకండ్ షో సమయంలో అభిమానుల పేరుతో బీభత్సం సృష్టించారు. కొందరు యువకులు సినిమా తెర చించేసి, సీట్లు ధ్వంసం చేశారు. ధియేటర్ ధ్వంసానికి కుట్రతోనే వచ్చారని సిబ్బంది అంటున్నారు. సినిమా మధ్యలో పది మంది అకస్మాత్తుగా లేచి గొడవ చేశారని థియేటర్ మేనేజర్ బొజ్జా మోహన్‌రావు తెలిపారు. స్క్రీన్ పైకి ఎక్కి కోసేశారు.. సీట్ల పైకి ఎక్కి పీకేశారని, అడ్డు వచ్చిన సిబ్బంది పై దాడి చేసి కొట్టారన్నారు. సిసి కెమెరాలు, బయట అద్దాలు కూడా ధ్వంసం చేశారన్నారు. పవన్ కల్యాణ్ అభిమానుల పేరుతో కావాలనే చేశారని ఆరోపించారు. నిజంగా అభిమానులు చేశారా.. రాజకీయ కారణాలతో చేశారా అనేది తేల్చాలన్నారు. రాత్రి జరిగిన ఘటన చూస్తే విధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానం కలుగుతుందన్నారు. పోలీసులు విచారణ చేసి ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని కోరారు. ఇటువంటివి జరగకుండా పవన్ కల్యాణ్ కూడా తమ అభిమానులను కంట్రోల్ చేయాలని బొజ్జా మోహన్‌రావు కోరారు.
ఇది వైసీపీ గూండాల పనే.. పవన్ కల్యాణ్ ఇమేజ్ డ్యామేజి చేసేందుకే జనసేన యువత ముసుగులో వైసీపీ గూండాలే విజయవాడ గాంధీనగర్ కపర్ధి ధియోటర్లో తొలిప్రేమ చిత్రం పదర్శనలో తెర చించారని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. ఇది రాజకీయ కుట్రేనన్నారు. నగర పోలీస్ కమీషనర్ స్పందించి కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటన వైసీపీ ఆరాచక మూకల దాడేనని తెలిపారు.